భారత కొత్త రాష్ట్రపతిగా ముర్ము ఎన్నికయ్యారు. ప్రస్తుత రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీకాలం ఈనెల 24తో పూర్తవుతుంది. అందువల్ల ఈనెల 22న రాష్ట్రపతి గా రాంనాధ్ కొవింద్ వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు అనేక మంది ప్రముఖులను ఆహ్వానించారు. ఏపీ నుంచి ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ జనసేన అధినేత పవన్ కు ఆహ్వానం అందిందట.


అయితే.. అనారోగ్య కారణాల వల్ల వెళ్లలేక పోతున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కోవింద్ గారి వీడ్కోలు సభకు  ఆహ్వానం‌ అందిందన్న పవన్ కల్యాణ్‌.. తనను ఆహ్వానించిన నరేంద్ర మోదీ గారికి, అమిత్ షా గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. చారిత్రాత్మక సభకు ఆరోగ్య కారణాల దృష్ట్యా వెళ్లలేకపోతున్నందుకు  చింతిస్తున్నాననన్న పవన్ కల్యాణ్‌.. అయిదేళ్ల పదవీకాలంలో ఎటువంటి పొరపొచ్చాలకు తావు లేకుండా రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించడం ఆయనలోని రాజనీతిజ్ఞతకు నిదర్శనమంటూ కొనియాడారు. ఆయన తన సేవలను అజరామరంగా నిర్వర్తించాలని ఆకాంక్షించారు. ఆ భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆరోగ్య ఆనందాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పవన్ కల్యాణ్‌ ప్రకటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: