తెలంగాణలో పాగా వేసేందుకు భాజపా జాతీయ నాయకత్వం మరింతగా దృష్టి సారిస్తోంది. ఇకపై  ప్రతి నెల రెండు రోజులు రాష్ట్రానికి అమిత్ షా రావాలని నిర్ణయించారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి మరింత సమయం ఇవ్వాలని అమిత్ షా నిర్ణయించారు. పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా సీనియర్ అరెస్సెస్ ప్రచారక్ ని జేపీ నడ్డా నియమించనున్నారు. ఉత్తర ప్రదేశ్ సంఘటన కార్యదర్శిగా ఉన్న సునీల్ బన్సల్ లేదా ఆ స్థాయి నేతను రాష్ట్రానికి సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా పంపించే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.


సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శిగా రాష్ట్రానికి చెందిన అర్ఎస్ఎస్ ప్రచారక్ ను నియమించే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే తెలంగాణ పార్టీ వ్యవహారాలకు సహా ఇంఛార్జిను కూడా నియమించే అవకాశం ఉందని చెబుతున్నారు. కేసీఆర్‌ బీజేపీని టార్గెట్ చేసినందువల్ల.. ఆయనతో అమీ తుమీ తేల్చుకోవాలని బీజేపీ అధిష్టానం సీరియస్‌గానే భావిస్తున్నట్టు తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

KCR