మోడీ సర్కారు నిత్యావసర వస్తువులను కూడా జీఎస్టీ పరిధిలోకి తేవటంపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో కేరళ సర్కారు సామాన్యులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. చిన్న దుకాణాల్లో ఒకటి, రెండు కేజీలు లేదా లూజ్‌గా విక్రయించే వస్తువులపై జీఎస్టీ విధించబోమని పేర్కొంది. ఈ మేరకు కేరళ ఆర్థికమంత్రి బాలగోపాల్‌ ఓ ప్రకటన చేశారు.


ఈ విషయమై కేంద్రంతో వివాదం ఏర్పడినా రాజీ పడేదిలేదని కేరళ ప్రకటించింది. నిత్యావసర వస్తువులను జీఎస్టీ పరిధిలోకి తేవటంపై జోక్యం చేసుకోవాలని కేరళ సీఎం పినరయి విజయన్‌ ఇప్పటికే మోడీకి లేఖ రాశారు కూడా. ప్యాక్‌ చేసిన నిత్యావసరాలను జీఎస్టీ పరిధిలోకి తేవటం మంచిది కాదంటున్న కేరళ.. దీనివల్ చిన్న దుకాణాల్లో కొనుగోలుచేసే వినియోగదారులపై భారం పడుతుందంటున్నారు. అందుకే కేరళ సీఎం ఈ విషయంపై ప్రధానికి లేఖ రాశారు. నిత్యావసరాలపై జీఎస్టీ ఉపసంహరించాలని కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: