రియల్ ఎస్టేట్.. మనం దాచుకున్న డబ్బును వేగంగా అభివృద్ధి చేసే వ్యాపారం. అయితే.. ఎక్కడ పెట్టుబడి పెట్టాలో.. ఎక్కడ పెట్టకూడదో తెలిసి ఉండాలి. ఏ ప్రాంతానికి డిమాండ్ ఉందో ఐడియా ఉండాలి.. ఇందుకు దేశంలోని అనేక సంస్థలు సర్వేలు చేస్తుంటాయి. తాజాగా అనరాక్‌ గ్రూప్‌ ఓ సర్వే విడుదల చేసింది. దేశంలో ఏ ప్రాంతంలో భూముల ధరలు వేగంగా పెరుగుతున్నాయో తెలిపింది.

ఈ సంస్థ నివేదిక ప్రకారం.. ఏడు ప్రధాన నగరాల్లో గత రెండున్నరేళ్లలో ప్లాట్‌ల ధరలు 38 శాతం పెరిగాయట. ప్రధానంగా దిల్లీ- ఎన్‌సీఆర్‌లోని యమునా ఎక్స్‌ప్రెస్‌వే వద్ద అత్యధికంగా పెరుగుదల ఉందట. కరోనా సంక్షోభం తర్వాత ప్లాట్‌లకు గిరాకీ పెరిగిందట. 2020 నుంచి ప్లాట్‌ల అభివృద్ధి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, పుణె, ముంబయి మెట్రోపాలిటన్‌ ఏరియా, దిల్లీ-ఎన్‌సీఆర్‌లలో బాగా జరిగిందట. ఈ నగరాల్లో గిరాకీ బాగా ఉందట. ప్రజలు వీటిని పెట్టుబడిగా చూస్తుండటమే ఇందుకు కారణమట.


మరింత సమాచారం తెలుసుకోండి: