విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రైవేటీకరణపై తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని కేంద్రం తేల్చి చెప్పేసింది. ఒక పక్క లాభాలు వస్తున్నాయంటూనే... ప్రైవేటీకరణకే మొగ్గు చూపుతున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. టిడిపి ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ఫగన్ సింగ్ కులస్తే... 2021-2022 ఆర్ధిక సంవత్సరంలో విశాఖ స్టీల్‌ కు రూ.913.19 కోట్లు లాభం వచ్చిందని తెలిపింది.


అయితే.. నూతన ప్రభుత్వ రంగ సంస్థ విధానం ప్రకారం... వ్యూహాత్మకేతర పరిశ్రమల్లో పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి కులస్తే తెలిపారు. సొంత గనుల కోసం చత్తీస్‌ఘడ్, ఒడిస్సాలను కేంద్ర ఉక్కుశాఖ కోరినట్లు కేంద్ర మంత్రి తన జవాబులో పేర్కొన్నారు. అంటే మొత్తానికి విశాఖ ఉక్కు లాభాల‌లో ఉందని కేంద్రం కూడా ఒప్పుకుంటూనే.. అయినా సరే అమ్మేస్తామని తేల్చి చెప్పిందన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: