ఏపీలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లకు గుడ్ న్యూస్.. వారి వేతనాల కోసం ఏపీ ప్రభుత్వం  768 కోట్ల రూపాయలను విడుదల చేసింది.  కొత్త పీఆర్సీ ప్రకారం గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వేతనాల చెల్లింపు కోసం బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ద్వారా ఈ మొత్తాన్ని విడుదల చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల వేతనాల కోసం కొత్త హెడ్స్ కేటాయించాలంటూ ఇటీవల ట్రెజరీస్ డైరెక్టర్ ప్రభుత్వానికి లేఖ రాశారు.


లేఖ మేరకు.. వేతన బిల్లుల కోసం కొత్త హెడ్ లను కేటాయించటంతో పాటు 768 కోట్ల రూపాయల మొత్తాన్ని విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. అంతే కాదు..  ఇప్పటి వరకూ ప్రోబెషన్ పూర్తి చేసుకున్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు మాత్రమే కొత్త పే స్కేళ్ల ప్రకారం వేతనాలను చెల్లించేందుకు ప్రభుత్వం ఈ ఉత్తర్వులు విడుదల చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: