నిన్నటి వరకూ రాష్ట్రపతి అయిన రామ్‌నాథ్‌ కోవింద్‌ నిన్నటి నుంచి మాజీ అయ్యారు. ఇప్పుడు ఆయన రాష్ట్రపతి భవన్ నుంచి. 12 జన్‌పథ్‌లోని నూతన నివాసానికి మారిపోయారు. మరి రాష్ట్రపతి మాజీ అయ్యాక ఏం సౌకర్యాలు ఉంటాయో తెలుసా.. రాష్ట్రపతి హోదాలో రామ్‌నాథ్‌ కోవింద్‌  నెలకు రూ.5 లక్షల జీతం అందుకున్నారు. ఇప్పుడు మాజీ రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ కోవింద్‌  ఇకపై రూ.2.5 లక్షలు పింఛన్‌ లభిస్తుంది. ఇది ఆయనకు జీవితాంతం వస్తుంది.


అలాగే రామ్‌నాథ్‌ కోవింద్‌ కు ఫోన్లు, కారుతో పాటు ఒక ప్రైవేటు కార్యదర్శి, ఒక అదనపు ప్రైవేటు కార్యదర్శి, ఒక పర్సనల్‌ అసిస్టెంట్‌ లను ప్రభుత్వం ఇస్తుంది. మరో  ఇద్దరు ప్యూన్లను కూడా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌  కోసం ప్రభుత్వం ఇస్తుంది. అలాగే ఉచిత వైద్య చికిత్సకు, దేశంలో ఎక్కడికైనా మరొకరిని వెంట తీసుకువెళ్లి ఉచితంగా ప్రయాణించడానికి రామ్‌నాథ్‌ కోవింద్‌ కు అర్హత లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: