ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ.7లక్షల పరిహారం వచ్చే వరకూ  పోరాడాలని జనసేన నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో కడప జిల్లా నేతలతో నాదెండ్ల మనోహర్  సమావేశమయ్యారు. కడప జిల్లాలో జరగబోయే కౌలురైతు భరోసా యాత్రపై నేతలతో నాదెండ్ల మనోహర్  సమాలోచనలు జరిపారు.


మూడేళ్లలో కడప జిల్లాలో 132మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. కౌలురైతు భరోసా యాత్ర ద్వారా బాధితుల కుటుంబాలకు జనసేన పార్టీ అండగా ఉంటుందని నాదెండ్ల మనోహర్ అన్నారు. ఎలాంటి ఒత్తిళ్లు, బెదిరింపులు వచ్చినా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాదెండ్ల మనోహర్ సూచించారు. దసరా పండుగ తర్వాత పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టబోయే యాత్ర ద్వారా రాష్ట్రంలో రాజకీయాలు మారతాయని నాదెండ్ల మనోహర్  అభిప్రాయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: