క్రీడలను కూడా పాకిస్తాన్ రాజకీయం చేయడంపై ఇండియా మండిపడింది. భారత్‌ వేదికగా తొలిసారి జరుగుతున్న 44వ చెస్ ఒలింపియాడ్‌ నుంచి అకస్మాత్తుగా పాకిస్థాన్‌ వైదొలగింది. ఈ విషయాన్ని తాజాగా ప్రకటించింది. దీనిపై భారత విదేశాంగ శాఖ తీవ్రస్థాయిలో మండిపడింది. ఇలాంటి ఆటలనూ రాజకీయం చేయడమేంటని విమర్శించింది. ఇది అత్యంత దురదృష్టకరమని ఇండియా బదులిచ్చింది.


చెస్‌ ఒలింపియాడ్‌ నుంచి వైదొలుగుతున్నట్టు పాకిస్థాన్‌ అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి తప్పుబట్టారు. అందులోనూ చెస్ ఒలంపియాడ్‌లో పాల్గొనేందుకు పాకిస్థాన్‌ టీమ్‌ భారత్‌కు చేరుకున్న తర్వాత అకస్మాత్తుగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరమని అరిందమ్‌ బాగ్చి అన్నారు.


అయితే.. ఒలింపియాడ్‌ టార్చ్‌ జమ్మూకశ్మీర్‌ మీదుగా వెళ్లడం వల్లే పాకిస్తాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. దీనిపై స్పందించిన ఇండియా.. జమ్మూకశ్మీర్‌, లద్ధాఖ్‌ భారత్‌లో అంతర్భాగంగానే ఉన్నాయని తేల్చి చెప్పింది.


మరింత సమాచారం తెలుసుకోండి: