పాకిస్తాన్‌లో హిందువులు మైనారిటీ అన్న విషయం తెలిసిందే. అక్కడ హిందువుల పరిస్థితులు కూడా చాలా దారుణంగా ఉంటాయని పత్రిక కథనాలు వస్తుంటాయి. అయితే.. అలాంటి మైనారిటీ కుటుంబం నుంచి ఓ మహిళ అక్కడ పట్టుదలతో పోలీస్‌ శాఖలో ఉన్నతోద్యోగం సంపాదించింది. పాకిస్తాన్‌లో హిందూ తొలి మహిళా డీఎస్పీగా రికార్టు సృష్టించింది.


పాకిస్థాన్‌లో మనీషా రుపేతా అనే 26 ఏళ్ల మహిళ ఈ ప్రత్యేకత సాధించింది. పాకిస్తాన్‌ పోలీస్‌ శాఖలో డీఎస్పీగా ఎంపికైన తొలి హిందూ మహిళగా చరిత్ర సృష్టించింది. మనీషా రుపేతా సింధ్‌ ప్రావిన్సు జాకోబాబాద్‌లోని ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. అమ్మాయిలకు టీచర్‌ లేదా డాక్టర్‌ ఉద్యోగాలు మేలని అంటుంటారు.. పురుషులు ఎక్కువగా ఉండే పోలీస్‌ శాఖలో ఇమడలేరని అంటుంచారు. ఆ ఆలోచన మార్చాలని అనుకున్నాననంటోంది మనీషా రుపేతా.. అందుకే పోలీస్‌ శాఖను ఎంచుకున్నానని చెబుతోంది. సింధ్‌ పబ్లిక్‌ సర్వీసెస్‌ కమిషన్‌ పరీక్షల్లో 16 ర్యాంకు సాధించి డీఎస్పీగా ఎన్నికైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: