కరోనా భయం ఇంకా తొలగిపోనే లేదు.. కానీ..అప్పుడే మరికొన్ని కొత్త వైరస్‌లు భయపెడుతున్నాయి. అలాంటి వాటిలో మంకీపాక్స్ ఒకటి..ఇండియాలో పెద్దగా కేసులు లేవు కానీ... అమెరికా, యూరప్ దేశాలలో ఈ కేసులు పెరుగుతున్నాయి. అంతే కాదు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ.. దీన్ని మహమ్మారిగా ప్రకటించింది. ముందు ముందు ఈ వ్యాధి విస్తరించే ప్రమాదం ఉందని హెచ్చరించింది.


అయితే.. ఈ వైరస్ రాకూడదంటే.. సెక్స్ పార్ట్‌నర్స్‌ను తగ్గించుకోవడం ఓ మార్గం అంటోందిం ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఎందుకంటే.. ఇప్పటివరకూ బయటపడిన కేసుల్లో 95శాతం అమెరికా, యూరప్‌ దేశాలలోనే ఉన్నాయట. అంతే కాదు.. మొత్తం మంకీ పాక్స్ కేసుల్లో 98 శాతం స్వలింగ సంపర్క పురుషులే ఉన్నారట. అందుకే ఈ మంకీ పాక్స్ వైరస్ ముప్పు తగ్గాలంటే  శృంగార భాగస్వాముల సంఖ్య తగ్గించుకోవాలట. ఈ మేరకు WHO సూచనలు చేసింది. ఈ మంకీ పాక్స్  వైరస్ ప్రభావం యూరప్ , అమెరికా దేశాల్లో ఎక్కువగా ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతూ.. అందుకు కారణం స్వలింగ సంపర్కమే అని తేల్చి చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: