దేశంలో అనేక ప్రాంతాల్లో నిత్యం  నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో తనిఖీలు చేస్తుంటుంది. మాదక ద్రవ్యాలను పట్టుకుంటుంది. అలా పట్టుకున్న డ్రగ్స్‌ మొత్తం ఇటీవల కాలంలో ఏకంగా 30వేల కేజీలకు చేరాయట. ఇప్పుడు వాటిని నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో అధికారులు ధ్వంసం చేశారు. సాక్షాత్తూ  కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమక్షంలోనే  ఈ ధ్వంసం ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా డ్రగ్స్ మహమ్మారిని పూర్తిగా అంతమొందించే వరకూ ఈ పోరాటం ఆగదన్నారు.


పంజాబ్‌ చంఢీగడ్‌లో మాదక ద్రవ్యాల రవాణా-జాతీయ భద్రతపై జాతీయ సదస్సును అమిత్‌ షా ప్రారంభించారు. ఆ తర్వాత దిల్లీ, చెన్నై, గౌహతి, కోల్‌కతాలో..... నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్‌సీబీ  స్వాధీనం చేసుకున్న సుమారు 30 వేల కిలోలకుపైగా డ్రగ్స్ ను అధికారులు అమిత్‌ షా సమక్షంలో ధ్వంసం చేశారు. వీటి విలువ 3 లక్షల కోట్లకు పైగా ఉంటుందని అంచనా.

మరింత సమాచారం తెలుసుకోండి: