రాష్ట్ర ప్రభుత్వం కాపులకు రిజర్వేషన్ కల్పించాల్సిందేనని కాపు జేఏసీ నేతలు కోరుతున్నారు. అలా జగన్ చేయకపోతే చరిత్రలో కాపు దోహిగా ముఖ్యమంత్రి జగన్ నిలిచిపోతారని ఏపీ కాపు జేఏసీ కన్వీనర్ ఆకుల రామకృష్ణ అంటున్నారు. కోనసీమ జిల్లా రావులపాలెంలోని మాట్లాడిన ఆయన.. కాకినాడ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ కాపులకు ఎన్నో అధికారులు ప్రవేశపెడుతున్నామని చెప్పడం, వేదికపై ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు జగన్ కు సన్మానం చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.


ఎన్నో ఏళ్లుగా కాపులను బీసీల్లో చేర్చాలని ఉద్యమాలు చేస్తుంటే, జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రిజర్వేషన్ కల్పించే అంశం రాష్ట్ర పరిధిలో లేదని కేంద్రం పరిధిలో ఉంటుందని చెప్పారని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం కేంద్రం రిజర్వేషన్లకు సంబంధించిన అంశం ఆయా రాష్ట్రాలకు అప్పగించినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని..ఇకనైనా  కాపులను బీసీల్లో చేర్చే అంశం తమ పరిధిలో ఉందా లేదా అన్నది ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: