సంతాన లేమి.. ఇప్పటి తరంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య ఇది. సంతానం లేకపోతే.. ఎంత ఆస్తిపాస్తులున్నా తృప్తి ఉండదు. అయితే.. ఇప్పుడు సంతానోత్పత్రి కేంద్రాలు వచ్చాయి. ఇంకా ఎన్నో వస్తున్నాయి. తాజాగా విశాఖలో లండన్ ఐవిఎఫ్ సంస్ధ సేవలు కూడా ఆరంభమయ్యాయి. ఈ కేంద్రాన్ని రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. సంతాన లేమితో సతమతమయ్యే వారికి ఈ సంస్ధ లో వివిధ అత్యాధునిక చికిత్సలు, పద్దతుల ద్వారా
సంతానం కలిగేలా చేస్తారు.


ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో  ఈ సంస్ధ సేవలు పలు నగరాల్లో విస్తరించినట్టు నిర్వాహకులు తెలిపారు. పిల్లలు లేని వారి సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటు, వారికి మానసికంగా ఊరట నిచ్చే విధంగా ఈ సంస్ధ కౌన్సిలింగ్ ఉంటుంది. అత్యాధునిక చికిత్సా పద్దతులు సంతానం కోసం ఎదురు చూసే దంపతులకు మంచి పరిష్కారం చూపుతాయని మంత్రి ధర్మాన ప్రసాదరావు అంటున్నారు. మంచి ప్రయత్నం చేశారని యాజమాన్యాన్ని మంత్రి అభినందించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: