బిసిలకు అన్ని రంగాలలో దామాషా ప్రకారం ప్రాతినిధ్యం దక్కాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 7, 8, 9 తేదీలలో ఢిల్లీలో మహా సభ నిర్వహించబోతున్నారు. ఈ విషయాన్ని ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశన శంకర్రావు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున బిసి లు పాల్గొని మహా సభను జయప్రదం చేయాలని  శంకర్రావు కోరారు. ఈ సందర్భంగా విజయవాడలో గోడపత్రికను శంకర్రావు ఆవిష్కరించారు.


బీసీలకు విద్యా ఉద్యోగ సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలలో బిసిలకు అన్యాయం జరుగుతూనే ఉందని ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశన శంకర్రావు పేర్కొన్నారు. బిసి ల సమస్యల పరిష్కారం కోరుతూ న్యూఢిల్లీలోని ఆగస్టు 7, 8, 9 తేదీలలో  తల్కటోరా స్టేడియం వద్ద  జాతీయ మహాసభ నిర్వహిస్తున్నట్లు ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశన శంకర్రావు తెలిపారు. ఈ మహా సభ లో  బీసీలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశన శంకర్రావు విజ్ఞప్తి చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

OBC