భారతీయుడు సినిమాలో కమల్‌ హాసన్‌ను చూసే ఉంటారు. అవినీతిని ఏమాత్రం సహించని భారతీయుడుగా కమల్ హాసన్ అద్భుత నటన కనబరిచారు. అయితే.. ఏపీ సీఎం జగన్ కూడా అవినీతిని సహించని కమల్ హాసనే అంటున్నారు మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు ఇటీవల వరద ప్రాంతాల్లో పర్యటించిన సమయంలో జగన్‌ను కోడి కమల్‌హాసన్‌ అంటూ వ్యంగ్యాంగా అన్నారు. దీనిపై మండిపడిన అంబటి రాంబాబు... దుర్మార్గులకు, దుష్టులను, చంద్రబాబు లాంటి 420 గాళ్లను రాజకీయంగా గొంతు కోయడానికి వచ్చిన భారతీయుడిలో కమల్‌హాసనే మన సీఎం వైయస్‌ జగన్‌ అని ప్రజలు చెబుతున్నారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.


1986లో భద్రాచలంలో కరకట్ట కట్టానని చంద్రబాబు కోతలు కొయ్యడం హాస్యాస్పదమని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. వరద బాధితుల పరామర్శ పేరుతో ప్రతిపక్షనేత చంద్రబాబు బురద రాజకీయాలు చేస్తున్నాడన్న అంబటి రాంబాబు..  పరామర్శకు వెళ్లి ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని ధ్వజమెత్తారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులతో శభాష్‌ అనిపించుకునేలా వైయస్‌ జగన్‌ ప్రభుత్వం పనిచేసిందని అంబటి అన్నారు. అది చూసి కడుపుమంటలతో చంద్రబాబు నోటికి వచ్చినట్టుగామాట్లాడుతున్నాడని అంబటి మండిపడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి: