జగన్ సర్కారు మరో 20 రోజుల్లో వారి కోరిక తీర్చబోతోంది. పట్టణ ప్రాంతాల్లో సొంత గూడు కోసం ఎదురు చూస్తున్న దాదాపు లక్షన్నర మందికి ఇళ్లు ఇవ్వబోతోంది. టిడ్కో ఇళ్ల నిర్మాణ ప్రగతినీ సమీక్షించిన సీఎం ఈ విషయం తెలిపారు. 15–20 రోజుల్లో మొత్తం 1.4 లక్షల ఇళ్లు సర్వం సిద్ధం అవుతున్నాయని సీఎం సమీక్షలో అధికారులు ఆయనకు తెలిపారు.

ఈ ఇళ్లను పూర్తి మౌలిక సదుపాయాలతో లబ్ధిదారులకు ఇళ్లు అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. అలాగే రిజిస్ట్రేషన్ల ప్రక్రియనూ వేగవంతం చేయాలన్నారు. టిడ్కో ఇళ్ల నిర్వహణపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాలన్న సీఎం... వీటి నిర్వహణ బాగుండేలా మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వాస్తవానికి ఈ టిడ్కో ఇళ్ల విషయంలో జగన్ ప్రభుత్వం చాలా రోజులుగా విమర్శలు ఎదుర్కొంటోంది. చంద్రబాబు హయాంలోనే ప్రారంభించినా వాటిని పూర్తి చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు వాటికి విముక్తి కలగబోతోందన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: