మూడు రాజధానుల అంశంపై సీఎం జగన్ పట్టుగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. ఆయన మూడు రాజధానుల అంశం అమలులో మాత్రం ఏమాత్రం ముందడుగు పడటం లేదు. పాలన మొదలై మూడేళ్లయినా అమరావతి నుంచే పాలన సాగుతోంది. కర్నూలుకు హైకోర్టు ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేదు.


అయితే.. కర్నూలుకు హైకోర్టును తప్పకుండా తీసుకొస్తామని వైసీపీ సర్కారు చెబుతోంది. ఈ మేరకు  మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మరోసారి గట్టిగా చెప్పేశారు. అంతే కాదు.. కర్నూలుకు నేషనల్‌ లా యూనివర్సిటీ భవనాన్ని నిర్మిస్తామని కూడా చెప్పారు. అలాగే రూ.30 కోట్లతో డోన్‌ రైల్వే లైన్‌ నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌–బెంగళూరు ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధికి ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నామని మంత్రి చెబుతునత్నారు. కర్నూలు మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశామంటున్నారు. ఏదేమైనా తగ్గేదే.. లే.. అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: