ఉక్రెయిన్‌ పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రత్యేకించి రష్యా ఇప్పుడు తూర్పు ఉక్రెయిన్ లోని డొనెట్క్స్  ప్రాంతంపై దృష్టి పెట్టింది. అందుకే ఆ ప్రాంతంలోని పౌరులంతా తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆదేశించారు. ఉక్రెయిన్ అధీనంలో ఉన్న తూర్పు డొనెట్స్క్ ప్రాంతంలో తీవ్రమైన యుద్ధం జరుగుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ  తెలిపారు. అయినా ఇంకా చాలామంది నివసిస్తున్నారన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ వీలైనంత మందిని రక్షిస్తూ రష్యా బలగాలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.


డొనెట్స్క్ ప్రాంతాన్ని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలను ఇప్పటికే ఉక్రెయిన్ చాలా సార్లు హెచ్చరించింది. అయినా ఇప్పటికీ ఆ ప్రాంతంలో 2 లక్షల నుంచి 2 లక్షల 20 వేలమంది నివసిస్తున్నారు. శీతాకాలంలో పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయి. చిన్నపిల్లలతో చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. శీతాకాలంలో ఇళ్లను వేడిగా ఉంచడానికి హీటర్లు పెట్టుకోవడానికి విద్యుత్  ఉండదు. చాలా అవస్థలు పడాల్సి వస్తుంది. అందుకే ఉక్రెయిన్ తన పౌరులను హెచ్చరించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: