ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం తర్వాత అనేక పరిణామాలు ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. ప్రత్యేకించి వాటిలో ఆహార పదార్థాల రవాణా ఒకటి. ఉక్రెయిన్ సస్యశ్యామల దేశం. ఆ దేశం నుంచి అనేక దేశాలు ధాన్యాలు, ఇతర పంటలు, ఆహార పదార్ధాలు దిగుమతి చేసుకుంటాయి. కానీ.. యుద్ధం వంటి ఆ ఎగుమతులు ఆగిపోయాయి. ఉక్రెయిన్ తీర ప్రాంతంలోని పట్టణాల్లో ఓడల్లో ధాన్యాలు నిలిచిపోయాయి.


మళ్లీ ఇన్నాళ్లకు ఉక్రెయిన్‌ నుంచి సముద్ర మార్గం ద్వారా ఆహార ధాన్యాల ఎగుమతులు మొదలయ్యాయి. యుద్ధం తర్వాత మొదటి రవాణా నౌక సోమవారం ఒడెస్సా నౌకాశ్రయం  నుంచి  ప్రారంభమైంది. టర్కీ రక్షణ శాఖ ఈ విషయాన్ని ప్రకటించింది. రజోని ఓడ  ఒడెస్సా నౌకాశ్రయం నుంచి లెబనాన్‌లోని ట్రిపోలీకి బయలుదేరిందని తెలిపింది. ఈ ఓడ ఆగస్టు 2 నాటికి ఇస్తాంబుల్‌కు చేరుకుంటుందట. ఈ నౌకలో 26 వేల టన్నుల మొక్కజొన్నలు ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: