అమెరికా, చైనా మధ్య మరోసారి తైవాన్ వివాదం కారణంగా ఉద్రిక్తత రాజుకుంటోంది. చైనా వద్దంటున్నా వినకుండా అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ తైవాన్‌లో పర్యటించడంపై చైనా ఆగ్రహంగా ఉంది. అందుకే చైనా అగ్రరాజ్యంపై ప్రతిచర్యలకు దిగుతోంది. ఇప్పటికే పెలోసీపై ఆంక్షలు విధించింది. ఇప్పుడు అమెరికాతో పలు అంశాలపై చర్చలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు చైనా ప్రకటించింది.

వాతావరణ మార్పులు, సైనిక సంబంధాలు, మాదకద్రవ్యాల నిరోధక ప్రయత్నాలు వంటి  అంశాలపై ఇరు దేశాల మధ్య చర్చలను నిలిపివేస్తున్నట్టు చైనా ప్రకటించింది. ఇరు దేశాల మధ్య ఏరియా కమాండర్లు, రక్షణశాఖ విభాగ అధిపతులు సమావేశాన్ని కూడా రద్దు చేసింది. మిలటరీ మారీటైమ్‌ సేఫ్టీ, అక్రమ వలసదారుల అప్పగింత వంటి అంశాలపై జరుగుతున్న చర్చలను కూడా చైనా నిలిపేసింది. ఆసియా పర్యటనలో భాగంగా నాన్సీ పెలోసీ మంగళవారం తైవాన్‌ రాజధాని తైపేలో పర్యటించడం చైనా ఆగ్రహానికి దారి తీసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: