వాతావరణ మార్పులు, సైనిక సంబంధాలు, మాదకద్రవ్యాల నిరోధక ప్రయత్నాలు వంటి అంశాలపై ఇరు దేశాల మధ్య చర్చలను నిలిపివేస్తున్నట్టు చైనా ప్రకటించింది. ఇరు దేశాల మధ్య ఏరియా కమాండర్లు, రక్షణశాఖ విభాగ అధిపతులు సమావేశాన్ని కూడా రద్దు చేసింది. మిలటరీ మారీటైమ్ సేఫ్టీ, అక్రమ వలసదారుల అప్పగింత వంటి అంశాలపై జరుగుతున్న చర్చలను కూడా చైనా నిలిపేసింది. ఆసియా పర్యటనలో భాగంగా నాన్సీ పెలోసీ మంగళవారం తైవాన్ రాజధాని తైపేలో పర్యటించడం చైనా ఆగ్రహానికి దారి తీసింది.