తైవాన్‌.. చైనా పక్కన ఉన్న చిన్న దేశం.. చైనా భూభాగానికి దగ్గరగా సముద్రంలో ఉండే.. దీవుల సమూహం తైవాన్.. అయితే ఆ  తైవాన్ కూడా మాదే అని చైనా వాదిస్తోంది. దాన్ని కబళించేందుకు ప్రయత్నిస్తోంది. ఇలాంటి సమయంలో తైవాన్‌కు అండగా అమెరికా నిలుస్తోంది. ఈ వివాదం ఇలా ఉంటే.. ఇప్పుడు తైవాన్‌కు అండగా ఆ దేశంలో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పర్యటించడం చైనాకు పుండు మీద కారణం చల్లినట్టు అనిపిస్తోంది.

అందుకే..  ఆ ద్వీప దేశం తైవాన్‌ను భయపెట్టేందుకు తైవాన్‌ చుట్టూ భారీ సైనిక విన్యాసాలు చేపడుతోంది. క్షిపణులను మోహరించి భయపెడుతోంది. తైవాన్‌ను తమ భూభాగమే అని మొదటి నుంచి చెబుతూ వస్తోన్న డ్రాగన్‌.. అమెరికా స్పీకర్ పర్యటనను తీవ్రంగా పరిగణించింది. చైనా సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తూ అమెరికా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడిందంటోంది. ఇందుకు అమెరికా మూల్యం చెల్లించుకోక తప్పదంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: