ప్రపంచంలో ఇప్పుడు మరో ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఓవైపు ఉక్రెయిన్ పై రష్యా దాడులు సాగుతూనే ఉండగా.. ఇప్పుడు పాలస్తీనాపై ఇజ్రాయల్ రాకెట్ల వర్షం కురిపిస్తోంది. ప్రత్యేకించి గాజా పట్టీ ప్రాంతంపై పై ఇజ్రాయెల్‌ దాడులు చేస్తోంది. పాలస్తీనా ఇస్లామిక్‌ జిహాద్‌ గ్రూపుకు చెందిన మిలిటెంట్‌ నాయకులను టార్గెట్ చేసుకుని ఈ దాడులు జరుగుతున్నాయి.

 పాలస్తీనా ఇస్లామిక్‌ జిహాద్‌ గ్రూపు ఇజ్రాయల్ పై దాడులకు ప్రయత్నిస్తోందన్న సమాచారంతోనే ఈ దాడులు చేస్తున్నట్టు ఇజ్రాయిల్ ప్రకటించుకుంటోంది. ఇజ్రాయల్ దాడుల్లో ఇప్పటి వరకూ 30 మంది వరకూ మరణించినట్టు తెలుస్తోంది. మరణించిన వారిలో పీఐజే నాయకులు ఖలీద్‌ మన్సూర్‌, తైసీర్‌ జబారీ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వీరు కాకుండా మరో ఆరుగురు చిన్నారులు కూడా  దాడుల్లో చనిపోయారు. శుక్రవారం నుంచి 400కు పైగా రాకెట్లను ఇజ్రాయల్ ప్రయోగించింది. మరి ఈ దాడులు ఇంకెన్ని రోజులు కొనసాగుతాయో..

మరింత సమాచారం తెలుసుకోండి: