చైనా ఓ చిన్న దేశాన్ని వణికిస్తోంది. తన సైనిక విన్యాసాలతో హడలెత్తిస్తోంది. ఏ దేశం అంటారా.. అదే తైవాన్.. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ ఇటీవల తైవాన్‌ లో పర్యటించిన సంగతి తెలిసిందే. దీనిపై  చైనా అగ్గి మీద గుగ్గిలంగా మండిపడుతోంది. నాన్సీ పెలోసీ పర్యటనపై ఇప్పటికే చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది కూడా. అందుకు స్పందనగా చైనా తైవాన్ చుట్టూ ఉన్న వాయు, సముద్ర జలాల్లో మిలటరీ విన్యాసాలు చేపట్టింది.


దీంతో చైనా, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. కానీ.. తైవాన్‌ జలసంధిని టార్గెట్‌ చేస్తూ చైనా యుద్ధ విమానాలు మోహరిస్తూనే ఉంది. డిస్ట్రాయర్‌ నౌకలతో విన్యాసాలు చేస్తూనే ఉంది. అయితే.. తైవాన్‌లో తక్షణమే సైనిక విన్యాసాలు నిలిపివేయాలంటూ అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌ వంటి దేశాలు కోరుతున్నాయి. కానీ.. చైనా మాత్రం తగ్గడం లేదు. అంతే కాదు.. తన సేనల పరాక్రమాన్ని తెలిపే వీడియోను చైనా అధికార మీడియా సంస్థ ద్వారా సోషల్ మీడియాలో పోస్టు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: