హీరో విశాల్.. అటు తమిళంలోనూ.. ఇటు తెలుగులోనూ క్రేజ్ ఉన్న నటుడు.. తెలుగు వాడైనా.. తమిళంలో మంచి యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న నటుడు విశాల్.. ఆయన తాజాగా ఓ సినిమా షూటింగ్‌లో గాయపడ్డారు. ఈ తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఆయన గాయపడ్డారు. విశాల్ కొత్త సినిమా మార్క్‌ ఆంటోనీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. అందులో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. మార్క్ ఆంటోనీ సినిమాలోని కీలకమైన ఫైట్‌ సీక్వెన్స్‌ చిత్రీకరణలో ఈ ప్రమాదం జరిగింది.


ప్రమాదంలో గాయపడిన విశాల్‌ కు ప్రథమ చికిత్స చేశారు. ఆ తర్వాత షూటింగ్ నిలిపేశారు. విశాల్ గాయపడినందువల్ల కొన్ని రోజులు మార్క్‌ ఆంటోనీ షూటింగ్ ఆగిపోయే అవకాశం ఉంది. సినిమాల కోసం రిస్క్ తీసుకోవడం విశాల్‌కు కొత్తేమీ కాదు.. గతంలోనూ ఆయన అనేక ఫైట్ సీక్వెన్స్ చిత్రీకరణ సమయాల్లోనూ విశాల్ గాయపడ్డారు. అయినా సహజత్వం కోసం ఆయన తపనపడుతుంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: