ప్రధాని మోదీ.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లయిన సందర్భంగా ఘనంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆజాదీగా అమృత్ మహోత్సవ్ పేరిట చాలా రోజుల నుంచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల నిర్వహణ కమిటీలో చంద్రబాబు కూడా సభ్యుడే కావడం విశేషం. మొన్న ఈ అంశంపై చర్చలకు చంద్రబాబు దిల్లీ వెళ్లారు.

ఆ కార్యక్రమంలో చంద్రబాబును మోదీ ప్రత్యేకంగా పలకరించడం.. మీడియాలో చర్చనీయాంశం అయ్యింది. ఇక ఇప్పుడు మోడీని మరింతగా ఆకట్టుకునేందుకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని పార్టీ తరపున కూడా ఘనంగా నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు పెద్దఎత్తున కార్యక్రమాలు చేపట్టాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు. ఈ నెల 13న హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో చంద్రబాబు జాతీయ జెండా ఎగురవేస్తారు. ఈ నెల 14న తన నివాసంలో చంద్రబాబు జెండా ఎగురవేస్తారు. ఈ నెల 15 న గుంటూరులో చేబ్రోలు హనుమయ్య ప్రాంగణంలో చంద్రబాబు జండా ఎగరేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు జెండా పండగను ఘనంగా నిర్వహించాలి అని పార్టీ నేతలకు సూచించిన చంద్రబాబు.. ఇలాగైనా మోదీకి దగ్గరవ్వాలనుకుంటున్నారేమో అని పొలిటికల్ సర్కిల్లో గుసగుసలు మొదలయ్యాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: