జైషే మహ్మద్‌ ఉగ్ర ముఠా చీఫ్‌ మసూద్‌ అజార్‌ సోదరుడు అబ్దుల్ రౌఫ్‌ అజార్‌  పై అంతర్జాతీయంగా ఆంక్షలు విధించే అంశాన్ని ఐక్య రాజ్య సమితిలో చైనా అడ్డుకోవడంతో పాకిస్తాన్ ఖుషీ ఖుషీగా ఉంది. అబ్దుల్ రౌఫ్‌ అజార్‌ పై ఆంక్షలు విధించేందుకు అమెరికా, భారత్‌ చేసిన ప్రతిపాదనను చైనా అడ్డుకోవడంతో మరోసారి చైనా, పాకిస్తాన్ కుట్ర పూరిత స్నేహం అంశం నిరూపితమైంది. పాకిస్థాన్‌ ఉగ్రవాదులపై నిషేధం తీసుకొచ్చేలా అమెరికా, భారత్‌ చేస్తోన్న ప్రయత్నాలకు చైనా నిర్ణయంతో మరోసారి అడ్డు తగిలినట్టైంది.


ఇలా చైనా చేయడం గత రెండు నెలల్లో ఇది రెండోసారి. జూన్‌లో లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్‌ అబ్దుల్ రెహ్మాన్‌ మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే ప్రతిపాదనను కూడా చైనా చివర్లో అడ్డుకుంది. అంత క్రితం జేషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజార్‌ను ఈ జాబితాలో చేర్చేందుకు భారత్ ప్రతిపాదించినా చైనా ఇలాగే అడ్డుపడింది. కానీ.. చివరకు అంతర్జాతీయ సమాజం ఒత్తిడితో చైనా వెనక్కి తగ్గింది. అజార్‌ను 2019లో అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐరాస ప్రకటించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: