ఈమధ్య కాలంలో జగన్ కార్యక్రమాలు చూస్తున్నారా.. ఏ బహిరంగ సభ అయినా..అది ఏ కార్యక్రమం అయినా జగన్ నోటి నుంచి మాత్రం ఓ డైలాగ్ మాత్రం తప్పకుండా వస్తోంది. అదే.. ఆ నలుగురు.. డైలాగ్.. ఆ నలుగురిని జగన్ టార్గెట్ చేస్తున్నారు. గతంలో కేవలం నలుగురు మాత్రమే దోచుకునేవారని చెబుతున్నారు. ఇంతకీ ఆ నలుగురు ఎవరు.. అది కూడా జగనే చెబుతున్నారు. ఆయన మాటల్లో చెప్పాలంటే.. ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, ఒక చంద్రబాబు.. ఇక  వీరికి తోడు ఒక దత్తపుత్రుడు ఉన్నారట.


గతంలో వీరు మాత్రమే దోచుకో, పంచుకో, తినుకో.. డీపీటీ పథకం అమలు చేసేవారట. ఈనాడు పేపర్‌ చదివినా, ఆంధ్రజ్యోతి, టీవీ5 టీవీలు చూసినా ఆ నలుగురి కడుపుమంట కనిపిస్తుందట.  గతంలో వారు దోచుకొని పంచుకునేవారని.. జగన్ వచ్చిన తరువాత దోచుకోవడం, పంచుకోవడం కుదరడం లేదని.. అది జీర్ణించుకోలేక వీరికి కడుపుమంట వస్తోందని జగన్ అంటున్నారు. మీటింగ్ ఏదైనా ఈ డైలాగ్ మాత్రం తప్పనిసరిగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: