మోదీ సర్కారు మరోసారి కొత్త బాంబు పేల్చబోతోంది. ఇకపై కరెంట్ రేట్లు కూడా నెల నెలా మారే  అవకాశం కనిపిస్తోంది. ఇకపై ఖర్చులను బట్టి ప్రజల నుంచి ఛార్జీలను వసూలు చేసుకునే స్వేచ్ఛను పూర్తిగా విద్యుత్‌ పంపిణీ సంస్థలైన డిస్కంలకే మోదీ సర్కారు అధికారం కట్టబెడుతోంది. ఈ మేరకు కేంద్ర విద్యుత్‌ చట్ట నియమావళికి సవరణలను కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. కరెంటు కొనుగోలు, ఇతర ఖర్చులు రోజురోజుకు పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకుంటోంది.


ఈ కొత్త విధానంతో నెలనెలా ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. ఈ కొత్త నియమావళి డ్రాఫ్ట్‌ను తాజాగ అన్ని రాష్ట్రాల విద్యుత్‌ శాఖలు, విద్యుత్‌ సంస్థలకు కేంద్రం పంపించింది. ఎవరికైనా అభ్యంతరాలు, సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరింది. సెప్టెంబరు 11లోగా మెయిల్‌ ద్వారా అభిప్రాయాలు తెలపాలని సూచించింది. దీన్ని బట్టి చూస్తే ఇక త్వరలోనే కరెంట్ చార్జీలు నెల వారీగా మారే అవకాశం కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: