ఏపీలోని పల్లెల కోసం పని చేసేందుకు అమెరికాలోని వైద్యులు కదిలారు. ప్రభుత్వాస్పత్రులను అన్ని మౌలిక వసతులతో తీర్చిదిద్దుతున్న ప్రభుత్వానికి తాము కూడా సహకరిస్తామన్నారు. ఒకేసారి పెద్ద ఎత్తున వైద్య కళాశాలలను నిర్మిస్తున్న నేపథ్యంలో వైద్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందించేందుకు అమెరికా వైద్యులు ముందుకొచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది. ఏపీ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విలేజ్‌ క్లినిక్స్, టెలి మెడిసిన్‌ సేవల్లో పాలుపంచుకునేందుకు అమెరికా వైద్యులు ఆసక్తి వ్యక్తం చేశారు.


డాక్టర్‌ రవి కొల్లి ఆధ్వర్యంలో అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజన్‌.. ఏఏపీఐకి చెందిన ఎన్నారై వైద్యుల బృందం తాడేపల్లిలోసీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసింది. ఈ అంశాలపై చర్చించింది. వచ్చే ఏడాది జనవరి 6, 8వ తేదీల్లో విశాఖలో నిర్వహించే ఏఏపీఐ గ్లోబల్‌ హెల్త్‌కేర్‌ 16వ సమ్మిట్‌కు రావాలని సీఎంను అమెరికా వైద్యులు ఆహ్వానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: