జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి సీఎం జగన్ పై విమర్శల వర్షం కురిపించారు. దావోస్‌ వెళ్లి ఫొటోలు దిగినంత మాత్రాన పెట్టుబడులు రావన్న  పవన్ కల్యాణ్‌.. జగన్‌ సీఎం అయిన తర్వాత రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు వచ్చాయని ప్రశ్నించారు. సీఎం జగన్ ఎంత మందికి ఉపాధి అవకాశాలు కల్పించారని పవన్ కల్యాణ్‌ ప్రశ్నించారు.


అద్భుతాలు జరుగుతాయని నేను పార్టీ పెట్టలేదన్న పవన్ కల్యాణ్‌.. కోట్లాదిమందికి నిర్దేశం చేయాలంటే రాజకీయంగా నలగాలని అభిప్రాయపడ్డారు.. అనుభవం లేకుండా అధికారంలోకి వస్తే వైసీపీ ప్రభుత్వం మాదిరే ఉంటుందని ఎద్దేవా చేశారు. పదవి వెతుక్కుంటూ రావాలి గానీ పదవి వెంట పడకూడదని పవన్ కల్యాణ్‌ అంటున్నారు. పదవి అనేది మన ప్రయాణంలో భాగంగా కావాలని..  స్థాయి, స్థోమత ఉంటే ప్రజలే ఆ అవకాశం ఇస్తారని పవన్‌ కల్యాణ్‌ అంటున్నారు. మరి పవన్ అడిగిన ఈ ప్రశ్నకు వైసీపీ సమాధానం ఇస్తుందా?


మరింత సమాచారం తెలుసుకోండి: