యమలీల సినిమాతో ఒక్కసారిగా టాప్ హీరోయిన్‌గా మారిన నటి ఇంద్రజ.. ఆ తర్వాత 30 సినిమాల వరకూ హీరోయిన్‌గా చేశారు. ఇక ఇప్పుడు మళ్లీ సినిమాలతో పాటు బుల్లితెరపైనా అలరిస్తున్నారు. జబర్దస్త్ జడ్జిగా ఇంటింటిని మళ్లీ పలకరిస్తున్నారు. అయితే.. ఇంద్రజది ప్రేమ వివాహం అన్న విషయం చాలా మందికి తెలియదు. ఆమె ఓ వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఆయన సినిమా ఇండస్ట్రీకి సంబంధం ఉన్నవారే.

ఇంద్రజ భర్త తమిళంలో కొన్ని సీరియళ్లు, యాడ్‌ ఫిల్మ్స్‌ చేశారు. ఇంద్రజ రిజిస్టర్‌ మ్యారేజీ చేసుకున్నారు. కేవలం 13 మందితో హోటల్‌కు వెళ్లి భోజనం చేసి ఇంటికి వెళ్లిపోయారట. రిసెప్షన్‌,  హానీమూన్‌ అంటూ ఏమీ చేయలేదట. అంతే కాదు.. పెళ్లికి ముందు భర్తకు ఆమె రెండు షరతులు పెట్టారట. అవేంటంటే.. పెళ్లయినా అమ్మా, నాన్న తనతోనే ఉంటారని ముందే చెప్పారట. అలాగే తన చెల్లెళ్లకు పెళ్లి చేయాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పిందట.


మరింత సమాచారం తెలుసుకోండి: