మాజీ సీఎం చంద్రబాబు గతంలో ప్రధాని మోదీపై చేసిన విమర్శలు మామూలువి కాదు.. 2019 ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు మోదీ, అమిత్‌షాలపై నిప్పులు చెరిగారు. అప్పట్లో మోదీకి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం ఉందని అంచనా వేసి చంద్రబాబు తప్పులో కాలేశారు. దీంతో మోదీ అధికారంలోనే కొనసాగుతుంటే.. చంద్రబాబు మాత్రం.. విపక్షంలోకి మారిపోయారు. ఆ తర్వాత క్రమంగా మోదీపై అయిష్టత తగ్గించుకున్న చంద్రబాబు ఇప్పుడు ఏకంగా మోదీని పొగడటం ప్రారంభించారు.


తాజాగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రసంగించిన చంద్రబాబు...నెహ్రూ నుంచి పివి నరసింహారావు, వాజ్ పేయి వంటి వారు దేశం కోసం ఎన్నో పనులు చేశారని గుర్తు చేసుకున్నారు. ఆ క్రమంలోనే ప్రస్తుతం నరేంద్ర మోదీ ఎన్నో విషయాల్లో ముందున్నారని చంద్రబాబు మెచ్చుకున్నారు. ప్రపంచంలో మేటైన మేధావులు ఉండే దేశం మనదన్న చంద్రబాబు.. పరదేశి పాలనలో దేశం దోపిడీకి గురైంది, ప్రజలు బానిసత్వం లో మగ్గారని.. విదేశీ పాలనలో పేదరికం, కరవు కాటకాలు అనుభవించారని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: