మన పొరుగు దేశం శ్రీలంకకు భారత్‌ ఓ అద్భుతమైన బహుమతి ఇచ్చింది. డోర్నియర్‌ నిఘా విమానాన్ని ఇండియా శ్రీలంకకు బహుమతిగా ఇచ్చింది. భారత్‌, శ్రీలంక మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాల కోసం ఇండియాబహుమతి అందజేసింది. ఈ బహుమతి అప్పగింత కార్యక్రమంలో శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేతోపాటు శ్రీలంకలోని భారత హైకమిషనర్ గోపాల్ బాగ్లే పాల్గొన్నారు. ఈ విమానానికి శ్రీలంక ప్రజల తరపున రణిల్‌ విక్రమ సింఘే స్వాగతం పలికారు.


భారత్‌ అందించిన ఈ డోర్నియర్ 228 ఎయిర్‌క్రాఫ్ట్ కు ఎంతో ప్రత్యేకత ఉంది.  2018లో ఢిల్లీలో జరిగిన రక్షణ చర్చల్లో భాగంగానే ఈ విమానాన్ని ఇండియా శ్రీలంకకు అందించింది. ఈ డోర్నియర్ విమానం శ్రీలంక తక్షణ భద్రతా అవసరాలను తీరుస్తుంది. ఈ నిఘా విమానాలను నడిపేందుకు భారత నౌకాదళం.. ఇప్పటికే శ్రీలంక నౌకాదళానికి శిక్షణ అందించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: