తెలంగాణలో ఈ ఉదయం 11.30 నిమిషాలకు రాష్ట్ర మంతటా ఓ అపురూప దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది. ఉదయం 11.30 నిమిషాలకు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమం కోసం ట్రాఫిక్ పోలీసులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రత్యేకించి హైదరాబాద్‌లో నగరంలోని అన్ని కూడళ్ల వద్ద ఈ ఉదయం 11.30గంటలకు జాతీయ గీతాలాపన నిర్వహిస్తారు.

ఇందు కోసం కూడళ్ల వద్ద అన్ని వైపులా ట్రాఫిక్ పోలీసులు రెడ్ సిగ్నళ్లు వేస్తారు. ఒక్క నిమిషం పాటు ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోతాయి. జాతీయ గీతాలాపనలో ప్రతి వాహనదారుడు పాల్గొనేలా ట్రాఫిక్ పోలీసులు జాగ్రత్తలు తీసుకోనున్నారు. వాహనదారులతో పాటు ట్రాఫిక్ పోలీసులు కూడా జాతీయ గీతాలాపన చేయనున్నారు. జాతీయ గీతాలాపన తర్వాత వాహనాలను ట్రాఫిక్ పోలీసులు ముందుకు పంపించనున్నారు. వాహనాల రద్దీ నెలకొనకుండా ట్రాఫిక్ పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: