చైనా తైవాన్‌ విషయంలో జోరు పెంచింది. తైవాన్‌ - అమెరికా స్నేహంపై భగ్గుమంటున్న చైనా  ఆ ద్వీపం చుట్టూ భీకరంగా సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది. తైవాన్‌ చుట్టూ ఆరు యుద్ధ నౌకలు మోహరించింది. అలాగే 22 యుద్ధ విమానాలను తైవాన్‌ చుట్టూ చక్కర్లు కొట్టిస్తోంది. తైవాన్‌ తమ  అంతర్భాగమని.. తమ జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని జిన్‌పింగ్‌ ఇటీవల అమెరికాను హెచ్చరించిన సంగతి తెలిసిందే.


ఈ నేపథ్యంలో అమెరికా నుంచి రెండు ప్రతినిధి బృందాలు వరుసగా తైవాన్‌లో పర్యటించాయి. ఇదే ఇప్పుడు చైనాకు ఆగ్రహం తెప్పిస్తోంది. తైవాన్‌ పై దూకుడు పెంచిన చైనా.. ఏ క్షణమైనా ఆ ద్వీపాన్ని ఆక్రమించుకోవచ్చనేలా వ్యవహరిస్తోంది. తైవాన్ విషయంలో అమెరికా కూడా పట్టుదలగానే ఉంది. అమెరికా స్పీకర్‌ నాన్సీ పెలోసీ నేతృత్వంలోని బృందం ఇటీవలే తైవాన్‌లో పర్యటించింది. తాజాగా డెమోక్రటిక్‌ సెనేటర్‌ ఎడ్‌ మార్కీ నేతృత్వంలోని బృందం తైవాన్‌లో పర్యటిస్తోంది. దీంతో రెచ్చిపోయిన చైనా తైవాన్‌ చుట్టూ సైనిక విన్యాసాలు చేపట్టి.. తైవాన్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: