అమెరికా, యూరప్‌ దేశాల్లో కార్చిచ్చులు పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయి. తాజాగా స్పెయిన్‌ దేశంలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. ఇక్కడ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న కారణంగా కార్చిచ్చు మరింతగా వ్యాపిస్తోంది. స్పెయిన్‌లోని అలికాంట్ ప్రావిన్స్‌లో దాదాపు 10 వేల హెక్టార్లు అగ్నికి ఆహుతైనట్టు స్పెయిన్ అధికారులు తెలిపారు. ఇప్పటికే వేల మందిని కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు స్పెయిన్ అధికారులు తెలిపారు.


స్పెయిన్‌లో రెచ్చిపోతున్న కార్చిచ్చును అదుపులోకి తెచ్చేందుకు ఆ దేశ అగ్నిమాపక  సిబ్బంది తీవ్రంగా యత్నిస్త్తోంది. స్పెయిన్ ఎమర్జెన్సీ యూనిట్‌ సిబ్బంది అగ్నికీలల్ని అదుపులోకి తెచ్చేందుకు స్థానిక సిబ్బందికి కూడా సాయం చేస్తున్నారు. స్పెయిన్‌లోని మరో  రెండు ప్రావిన్సుల్లో కూడా కార్చిచ్చు ప్రభావం కొనసాగుతోంది. ఇలాంటి కార్చిచ్చు వల్ల ఈ ఏడాది దాదాపు 2.5లక్షల హెక్టార్ల అడవి అగ్నికి  ఆహుతైందని యూరోపియన్ ఫారెస్ట్ ఫైర్  ఇన్ఫర్మేషన్ సిస్టమ్ చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: