ఓవైపు అణు యుద్ధం ముప్పు పొంచి ఉందని విశ్లేషకుల అంచనాలు వెలువడుతున్న సమయంలో రష్యా రాకెట్‌ లాంచర్‌తో కూడిన సైనిక రోబోట్‌ అంతర్జాతీయంగా వార్తల్లోకి ఎక్కింది. ఈ ఏడాది రష్యన్ ఆర్మీ ఎగ్జిబిషన్‌లో భాగంగా మాస్కోలో ఈ రాకెట్ లాంచర్ రోబోను ఆవిష్కరించారు.

నాలుగు కాళ్లు కలిగి.. కుక్కను పోలిన ఈ  రోబో యుద్ధం చేయడంలో దిట్ట. ఈ లాకెట్ లాంచర్ రోబో లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదిస్తుంది. అంతే కాదు.. ఆయుధాలను సరఫరా చేసే సామర్థ్యం కూడా ఈ రాకెట్ లాంచర్ రోబోకు ఉంది. గతంలో ఇదే తరహా రోబోట్‌ను చైనా కూడా తయారు చేసింది. ఇప్పుడు రష్యా రోబోట్‌కు కూడా దాదాపు అవే పోలికలతో ఉండటం విశేషం. ఇక ముందు ముందు యుద్ధాలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతోనే జరుగుతాయన్న అంచనాలు ఉన్న సమయంలో ఈ మానవ రహిత డ్రోన్లు, రోబోట్‌ల తయారీ కీలకంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: