తెలంగాణలో ఒకటి రెండు రోజుల్లో కరెంటు సరఫరాకు ఇబ్బందులు తప్పవట. కరంట్‌ విషయంలో కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉందని తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు చెబుతున్నారు. ఈ మేరకు ప్రజలు సహకరించాలని ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. కేంద్రం ముందుగా  నోటీసు ఇవ్వకుండా ఎక్స్ఛేంజీ నుంచి కరెంటు కొనకుండా ఆదేశాలిచ్చిందని ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు తెలిపారు.

బకాయిలు రూ.1360 కోట్లు చెల్లించినా, కరెంటు కొనకుండా కేంద్రం ఆపడం బాధాకరమని ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు అన్నారు. కరంట్ విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు జల విద్యుత్‌ను పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేస్తున్నామని ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు తెలిపారు. కరంట్‌కు కొరత రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామమని.. శుక్రవారం  12,214 మెగావాట్ల డిమాండ్‌ వచ్చినా కోతలు విధించలేదని ఆయన అన్నారు. త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందన్న ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు... అప్పటివరకు సరఫరాలో ఇబ్బందులు వచ్చినా ప్రజలు సహకరించాలన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: