ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో వైద్య, ఆరోగ్యశాఖలో మరో 4 వేల పోస్టులను భర్తీ చేయనుంది. ఈ విషయాన్ని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణ బాబు వెల్లడించారు. వైద్యఆరోగ్యశాఖలో ఇప్పటికే 42వేల పోస్టులు ఇప్పటికే భర్తీ చేశామని ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణ బాబు చెప్పారు. నాడు-నేడు పథకం కింద రూ.16వేల కోట్లతో ఆసుపత్రులను ఆధునికీకరిస్తున్నట్టు ఎంటీ కృష్ణ బాబు వివరించారు.

ఏపీఎంఎస్‌ఐడీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మురళీధర్‌ రెడ్డి, సీఎం కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి ఎం.హరికృష్ణతో కలిసి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను సందర్శించారు. అక్కడి  ఆసుపత్రి నిర్వహణ, రోగులకు అందుతున్న వైద్యసేవలపై కృష్ణబాబు ఆరా తీశారు. ఆ తర్వాత వివిధ విభాగాల అధిపతులతో ఎంటీ కృష్ణ బాబు సమీక్ష నిర్వహించారు.  సెప్టెంబరు 5 తర్వాత సీఎం జగన్‌ ఆసుపత్రులను తనిఖీ చేస్తారనీ కృష్ణబాబు వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: