తమిళ దర్శకుడికి ఏకంగా కోర్టు ఆరు నెలల పాటు జైలు శిక్ష విధించింది. ప్రముఖ తమిళ దర్శకుడు లింగుస్వామి చెక్‌బౌన్స్‌ కేసులో ఆరు నెలల జైలు శిక్ష పడింది. చెన్నైలోని సైదాపేట్‌ కోర్టు ఈ తీర్పు వెలువరించింది.  అసలేమైందంటే.. తెలుగు చిత్రాల నిర్మాణ సంస్థ పీవీపీ సినిమాస్‌ నుంచి లింగు స్వామి, ఆయన సోదరుడు సుభాష్‌ చంద్రబోస్‌ కొంత డబ్బు అప్పు తీసుకున్నారు. కార్తి, సమంత జంటగా లింగుస్వామితో ఓ సినిమా తీయాలనుకున్నారు.

అనుకోని పరిస్థితుల్లో ఆ సినిమా తీయలేదు. పీవీపీ తన అడ్వాన్స్ సొమ్ము ఇమ్మని అడిగితే ఆయన ఓ చెక్ ఇచ్చారు. కానీ.. ఆ చెక్కు బౌన్స్‌ అయ్యింది. దీంతో పీవీపీ సంస్థ కోర్టును ఆశ్రయించింది. సోమవారం ఈ కేసు విచారణకు వచ్చింది. కోర్టు లింగుస్వామి, అతని సోదరుడికి ఆరు నెలల జైలు శిక్ష వేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: