పాదయాత్ర.. 2004లో వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర.. రాజకీయాలకే క్రేజ్‌ తెచ్చింది. ఆ సుదీర్ఘ పాదయాత్ర తర్వాత ఆయన సీఎం అయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు కూడా పాదయాత్రల బాటపట్టారు. కాస్త ఆలస్యం అయినా ఆయన కూడా మరోసారి 2014లో సీఎం అయ్యారు. ఇక జగన్ సంగతి తెలిసిందే. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన పాదయాత్ర చేశారు. సీఎం అయ్యారు.

ఇప్పుడు లోకేశ్ కూడా పాదయాత్రపై దృష్టి పెట్టారు. మరి పవన్ కల్యాణ్‌ కూడా పాదయాత్ర చేస్తారా.. అన్న ప్రశ్న జనసేన కార్యకర్తల్లో ఉంది. అయితే దీనిపై పవన్ తాజాగా కాస్త క్లారిటీ ఇచ్చారు. పాదయాత్రలు చేస్తేనే సీఎం అవుతారా అంటూ ఆయన ప్రశ్నించిన తీరు చూస్తే.. ఆయనకు పాదయాత్ర చేసే ఆలోచన ఉన్నట్టు కనిపించడం లేదు. నితీశ్ కుమార్‌, శిందే లాంటి వాళ్లు ఏం పాదయాత్రలు చేశారని ఎదురు ప్రశ్నించారు. అంటే పవన్‌ కు పాదయాత్ర ఆలోచన లేనట్టే..?

మరింత సమాచారం తెలుసుకోండి: