ఉక్రెయిన్‌ పై రష్యా యుద్ధం ప్రారంభించి ఆరు నెలలు దాటుతోంది. కానీ ఇంకా యుద్ధం ఓ కొలిక్కి రాలేదు. ఉక్రెయిన్‌కు సంబంధించిన కొన్ని ప్రాంతాలను మాత్రం రష్యా ఆక్రమించుకుంది. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో రష్యా తన జెండా కూడా ఎగరేసింది. అయితే... యుద్ధం మాత్రం ఇంకా కొలిక్కి రాలేదు. అందుకే రష్యా ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌పై సైనికచర్య కొనసాగిస్తున్న రష్యా తన మిలిటరీ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.


ఇప్పుడు రక్షణ దళాల్లో మరో లక్షన్నర మందిని నియమించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు జారీ చేశారు. అయితే స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వారిని  కాంట్రాక్ట్ పద్ధతిలో సైన్యంలోకి తీసుకుంటారు. అంతే కాదు..  కొత్తగా నియమితులైన వారు  ఉక్రెయిన్‌లో  జరుగుతున్న సైనిక చర్యలో పాల్గొనాల్సి ఉంటుందని ముందే షరతు పెట్టేసింది. ఈ రష్యా నిర్ణయంతో ఉక్రెయిన్‌లో దడ పడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: