ఆ మణిపూర్ చిన్నది తన పంచ్‌లతో అదరగొట్టింది. ఏకంగా ప్రపంచ యూత్‌ క్యాడెట్‌ జూడో ఛాంపియన్‌షిప్‌లో కొత్త చాంపియన్‌గా అవతరించింది. మణిపూర్‌కు చెందిన 15 ఏళ్ల లింతోయ్‌ చనాంబమ్‌ అలా స్వర్ణంతో చరిత్ర సృష్టించింది. ప్రపంచ యూత్‌ క్యాడెట్‌ జూడో ఛాంపియన్‌షిప్‌లో ఛాంపియన్‌గా నిలిచింది ఈ మణిపురి చిన్నది. అంతే కాదు..  ఈ ఘనత సాధించిన తొలి భారత జుడోకాగా  15 ఏళ్ల లింతోయ్‌ చనాంబమ్‌  రికార్డులకెక్కింది.

మరో విశేషం ఏంటంటే..  పురుషులు, మహిళలు ఏ విభాగంలోనైనా భారత్‌కు దక్కిన తొలి స్వర్ణం ఇదే. మహిళల 57 కేజీల విభాగం ఫైనల్లో  15 ఏళ్ల లింతోయ్‌ చనాంబమ్‌.. 1-0తో బ్రెజిల్‌కు చెందిన బినాకా రీస్‌ ను మట్టికరిపించింది. ఇప్పటికే ఆసియా ఛాంపియన్‌గా ఉన్న ఈ 15 ఏళ్ల మణిపురి కుర్రది.. ఫైనల్లో పసిడి దక్కించుకుంది. 2018లో జాతీయ సబ్‌ జూనియర్‌ టోర్నీలో స్వర్ణం గెలిచి దేశం దృష్టిని ఆకర్షించిన  15 ఏళ్ల లింతోయ్‌ చనాంబమ్‌.. ఇటీవల బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా క్యాడెట్‌ టోర్నీలోనూ ఛాంపియన్‌గా అవతరించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: