రవితేజ నటించిన రాజా ద్రి గ్రేట్.. సినిమా చూసే ఉంటారు. సూపర్ హిట్ అయిన ఆ సినిమాలో హీరో రవితేజ గుడ్డివాడు.. ఏమీ కనిపించదు. అయినా.. కళ్లున్న హీరోలా అన్ని పనులు చేసేస్తాడు. అదేమిటంటే.. వాళ్ల అమ్మ చిన్నప్పటి నుంచి ఆయనకు ట్రైనింగ్ ఇచ్చిందని కథలో చెబుతారు. ఐయామ్ ది బ్లైండ్.. బట్ అయామ్‌ ది ట్రెయిన్డ్‌ అంటూ రవితేజ పదే పదే ఓ డైలాగ్ చెబుతారు. కళ్లు లేకపోయినా మనసుతోనే పరిసరాలను అంచనా వేస్తాడు రవితేజ ఆ సినిమాలో.


ఏదో సినిమా కదా.. అలా చూపిస్తారు కానీ.. నిజంగా అలా ఉంటారా.. కళ్లు లేకపోయినా అంత సులభంగా పనులు చేసుకుంటారా.. అని ఆశ్చర్యపోతాం.. అయితే.. అచ్చం రవితేజ సినిమాలో అంధ హీరో తరహాలోనే ఓ 62 ఏళ్ల వృద్ధుడు.. అన్ని పనులు చేసుకుంటూ ఔరా అనిపిస్తున్నాడు.
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యాపురానికి చెందిన రాజయ్య.. చిన్నప్పుడే కంటిచూపు లేకపోయినా.. ఏ సహాయం లేకుండానే ఊరంతా తిరగుతారు. నీటి బావుల్లోకి దిగి పాడైన మోటార్లను బయటికి తీస్తాడు. వాటికి మరమ్మతులు కూడా చేస్తాడు. తన వంట తానే చేసుకుంటాడు. గ్యాస్‌ పొయ్యి మీద వంట చేసుకుంటాడు. గ్రేట్ కదా.

మరింత సమాచారం తెలుసుకోండి: