బెజవాడ పోలీసులకు ఒకటో తారీఖు టెన్షన్ పట్టుకుంది. సెప్టెంబరు 1వ తేదీ అంటేనే వారు టెన్షన్‌ పడుతున్నారు. ఎందుకంటే..  సీపీఎస్‌ రద్దు కోసం ఉద్యోగ సంఘాలు ఒకటో తారీఖున తాడేపల్లిలోని సీఎం ఇంటి ముట్టడి నిర్వహించబోతున్నారు. అలాగే విజయవాడలో భారీ ప్రదర్శన, సభ నిర్వహించనున్నాయి. ఈ కార్యక్రమాల నేపథ్యంలో ఉద్యోగులను కట్టడి చేసేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు.

ఇప్పటికే ఈ కార్యక్రమాలకు హాజరు కావద్దంటూ ఉద్యోగ సంఘాల నేతలకు నోటీసులు ఇస్తున్నారు. ఇలాగే ఈ ఏడాది ఫిబ్రవరి 3న కూడా ఉద్యోగులు విజయవాడ వచ్చి రచ్చ రచ్చ చేశారు.  బీఆర్‌టీఎస్‌ రోడ్డులో ఉద్యోగులు ‘చలో విజయవాడ’ కార్యక్రమం ఘనంగా  నిర్వహించారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా.. ఆ కార్యక్రమానికి జిల్లాల నుంచి విజయవాడకు ఉద్యోగులు భారీగా వచ్చారు. కార్యక్రమం గ్రాండ్ సక్సస్ అయ్యింది. దీంతో సీఎం నుంచి పోలీసు పెద్దలకు అక్షింతలు పడ్డాయి. మళ్లీ ఆ సీన్ రిపీట్  కాకూడదన్న టెన్షన్ పోలీసుల్లో కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: