వినాయకచవితి సందడి మొదలైంది. వీధివిధినా గణనాధులు కొలువు దీరుతున్నారు. అయితే.. పండుగ సజావుగా సాగేందుకు పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి విజయవాడ నగర పరిధిలో వినాయక పందిళ్లకు సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు ఇస్తున్నారు.
ఇప్పటివరకు 1275 పందిళ్లకు దరఖాస్తులు వచ్చాయని బెజవాడ పోలీసులు చెబుతున్నారు. విగ్రహం పెట్టాలంటే.. మున్సిపల్, విద్యుత్, అగ్ని మాపక శాఖల నుంచి ఎన్ ఓసిలు తీసుకోవాలని తెలిపారు .

దరఖాస్తు చేసుకున్నాక పోలీసులు మండపాలు ఏర్పాటు చేసే ప్రదేశానికి వెళ్లి పరిశీలించి అనుమతినిస్తారు. మున్సిపల్ శాఖకు  రూ.500, ఫైర్ వింగ్ కు రూ. 500 చలానా రూపంలో చెల్లించాలి. విద్యుత్ శాఖ నుంచి తాత్కాలిక లైసెన్స్ ను తీసుకోవాలి. దానికి నిబంధనల ప్రకారం రుసుము చెల్లించాలి. పందిళ్ల వద్ద  మైక్ ఏర్పాటు చేసుకున్నందుకు రోజుకు రూ. 100  చొప్పున పోలీసులకు చలానా రూపంలో చెల్లించాలి. ఈ నిబంధన గత కొన్నేళ్లుగా కొనసాగుతోంది. వినాయక మండపాల వద్ద రాత్రి సమయంలో నిర్వాహకులు నిద్రించాలి. ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు పూజలు చేసుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: