ఎర్ర చందనం.. ఏపీ, తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లోనూ శేషాచలం కొండల్లోనే పెరిగే ఓ అరుదైన వృక్ష రాజం. అందుకే దీనిపై స్మగ్లర్ల కన్నుపడుతుంది. అయితే..అరుదైన వృక్షం కావడంతో దీని విషయంలో చట్టాలు కూడా చాలా పటిష్టంగా ఉన్నాయి. ఈ చందనాన్ని రాష్ట్ర ప్రభుత్వం నేరుగా అమ్ముకునే వీలు లేదు. అందుకు కేంద్రం నుంచి అనుమతులు తప్పనిసరి. ఇప్పటికే ఏపీలోని అనేక ఫారెస్టు రేంజుల్లో ఎర్రచందనం నిల్వలు పేరుకుపోయాయి.


అయితే.. ఇప్పుడు ఏపీకి ఓ గుడ్ న్యూస్ వచ్చింది. ఎర్ర చందనం అమ్మకానికి కావలసిన అన్ని అనుమతులు ఇప్పుడు ఏపీకి వచ్చాయట. అందుకే త్వరలో 2 వేల 640 మెట్రిక్‌ టన్నుల విక్రయానికి ఏపీ ఫారెస్టు అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారట. ఈ విషయాన్ని వారు సీఎంకు తాజాగా సమీక్షలో తెలిపారు.  ఎర్రచందనం విక్రయంలో అత్యంత పారదర్శక విధానాలు పాటించాలని సీఎం జగన్ వారికి సూచించారు. గ్రేడింగ్‌లో థర్డ్‌ పార్టీ చేత కూడా పరిశీలన చేయించాలని కూడా సీఎం జగన్ ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: