ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం సిద్దం కావాలంటున్నారు ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు.. దీని కోసం పదేళ్ల టార్గెట్‌తో ముందుకు పోవాలని ఆయన సూచిస్తున్నారు. అన్నివర్గాల  అంచనాలను అందుకోవటానికి ఈ రూట్‌ మ్యాప్‌ దోహదం చేస్తుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు సూచిస్తున్నారు. ప్రభుత్వ యాజమాన్యంలోని పీఎస్‌బీల ప్రైవేటీకరణకు బిగ్  బ్యాంగ్  విధానం సరైనది కాదని దువ్వూరి అభిప్రాయపడ్డారు.


అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్పొరేటీకరణ గురించి ప్రభుత్వం ఆలోచించాలని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు సూచిస్తున్నారు. అప్పుడే అవన్నీ ఆర్ బీఐ నియంత్రణలోకి వస్తాయని దువ్వూరి సుబ్బారావు పేర్కొన్నారు. పీఎస్‌బీలను ప్రైవేటీకరిస్తే బ్యాంకింగ్  వ్యవస్థ సామర్థ్యం మెరుగుపడుతుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు చెబుతున్నారు. అయితే.. ఇదే సమయంలో దీనివల్ల ప్రాధాన్య రంగాలకు రుణాల జారీలో రాజీపడటం ప్రతికూలాంశంగా మారే ప్రమాదం కూడా ఉందన్నారు. 2020లో ప్రభుత్వం 10 జాతీయ బ్యాంకులను విలీనం చేసి నాలుగు  పెద్ద బ్యాంకులుగా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: